Kerala CM : కేరళ సీఎం పినరయ్ కంట తడి
ఆత్మీయుడిని కోల్పోయానని ఆవేదన
Kerala CM : అనారోగ్యంతో మృతి చెందిన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ భౌతిక కాయానికి సీఎం పినరయ్ విజయన్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన కంటతడి పెట్టారు. కేరళ రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు తరలి వస్తున్నారు.
Kerala CM Words
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ , కేసీ వేణుగోపాల్ తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు ఏఐసీసీ ఆధ్వర్యంలో కొద్ది సేపు మౌనం పాటించారు.
విలక్షణమైన నాయకుడిగా గుర్తింపు పొందారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు ఖర్గే. గొప్ప ఆత్మీయుడిని తాను కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు పినరయ్ విజయన్(Pinarayi Vijayan). ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. 11 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వివిధ హోదాలలో పని చేశారు. కేరళకు 2 సార్లు సీఎంగా పని చేశారు. ఊమెన్ చాందీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు సీఎం.
మేమిద్దరం వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్లం. మా భావజాలాలు వేర్వేరు. కానీ మా స్నేహం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు పినరయ్ విజయన్.
Also Read : Foxconn Invest : కర్ణాటకలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి రూ. 8,800 కోట్లు