Kerala HC Refuses : కేరళ స్టోరీ నిర్మాతకు కోర్టు షాక్
32,000 మహిళా టీజర్ తొలగించాలి
Kerala HC Refuses : దేశ వ్యాప్తంగా కేరళ స్టోరీ మూవీ కలకలం రేపుతోంది. దీనిపై తీవ్ర వివాదం నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి 32,000 మహిళా టీజర్ ను తొలగించాలని కేరళ స్టోరీ నిర్మాత ను ఆదేశించింది కేరళ హైకోర్టు(Kerala HC Refuses). విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దక్షిణాదిలోని కేరళకు చెందిన 32 వేల మందికి పైగా మహిళలు ఇస్లామిక్ స్టేట్ లేదా ఐసిస్ లోకి రిక్రూట్ అయ్యారని పేర్కొన్న టీజర్ ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ టీజర్ తీవ్ర వివాదాలకు దారి తీసింది. దీనికి సంబంధించి నమోదైన కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్ నగరేష్ , జస్టిస్ సోఫీ థామస్ లతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
ఈ చిత్రం నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిందని అని మాత్రమే చెబుతుందని గమనించిన కోర్టు సినిమా విడుదలను నిలిపి వేసేందుకు నిరాకరించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమా పబ్లిక్ వ్యూ కోసం సర్టిపై చేసిందని ధర్మాసనం(Kerala HC Refuses) స్పష్టం చేసింది.
అయితే ధర్మాసనం చలన చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను వీక్షించేందుకకు ముందు దాని ప్రదర్శనలను నిలిపి వేసేందుకు నిరాకరించింది. ఇందులో ఏ ప్రత్యక వర్గానికి అభ్యంతరకరమైనది ఏమీ లేదని స్పష్టం చేసింది కోర్టు.
Also Read : పవార్ రాజీనామా ప్యానల్ తిరస్కరణ
