Wayanad: రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది.

రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది.

Wayanad: వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ ఏడో రోజు సోమవారం ముమ్మరంగా కొనసాగుతుంది. కొద్ది సేపటి క్రితమే కాంతన్‌పరా వద్ద చిక్కుకున్న 18 మంది సహాయక సిబ్బందిని హెలికాఫ్టర్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.వాయనాడ్(Wayanad), మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నది 40కిలోమీటర్ల మేర సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Wayanad Updates

మొత్తం 1500మంది ఫైర్‌ఫోర్స్‌ సిబ్బంది, వాలంటీలర్లు సంయుక్తంగా కలిసి ముందక్కైలో సహాయచర్యల్ని కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో తవ్వే కొద్దీ శవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆదివారం వరకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆరుజోన్లుగా విభజించిన ఆర్మీ, నేవీ, ఫారెస్ట్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు బాధితుల జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇవ్వాళ సైతం సహాయక చర్యల్ని ప్రారంభించినట్లు చెప్పారు. వాయనాడ్‌లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సహాయక శిబిరాలు నిర్వహిస్తున్న పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి. రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటికే 387మృత దేహాలు వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం శిధిలాల కింద వెతుకుతున్నారు.

అయితే ఘటన జరిగి ఆరురోజులు కావడంతో ప్రాణాలతో బయటపడడం కష్టమేనని అంటున్నారు స్థానికులు. దాదాపూ 200మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. ఆర్మీ,ఎన్డీఆర్‌ఎఫ్‌,కేరళ పోలీసులు,ఫైర్‌,రెస్క్యూ డిపార్ట్‌మెంట్లు గాలింపులు చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్నిపర్‌ డాగ్స్‌ డోన్స్‌ద్వారా గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. కొండచరియల బీభత్సం పదుల సంఖ్యలో కుటుంబాలను బలితీసుకుంది. తమవారి ఆచూకి లభించకపోతుందా అని చాలా మంది రెస్క్యూ ఆపరేషన్‌ జరుపుతున్న ప్రాంతాల్లో చూస్తున్న ఎదురుచూపులు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నాయి.

Also Read : CM Chandrababu Naidu : జగన్ సర్కార్ రేషన్ బియ్యం డోర్ డెలివరీ స్కీమ్ లో 1800 కోట్ల అవినీతి

Leave A Reply

Your Email Id will not be published!