Kesineni Nani: చంద్రబాబుకు కేశినేని నాని సవాల్‌ !

చంద్రబాబుకు కేశినేని నాని సవాల్‌ !

Kesineni Nani: విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నేను రూ. 400 కోట్లు తెస్తే… ఆ నిధులను ఉపయోగించి డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయడంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం… చంద్రబాబు 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప ఐదేళ్లలో ఏమీ కట్టలేకపోయాడు. అమరావతి కోసం చంద్రబాబు… కనీసం 3వేల కోట్లైనా ఖర్చు చేశాడా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై చర్చించడానికి నేను సిద్ధం…చంద్రబాబు సిద్ధమా అంటూ నాని సవాల్ విసిరారు. ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన నాని… పలు విషయాలపై చంద్రబాబును ఏకరువు పెట్టారు.

Kesineni Nani Challange to Chandrababu

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ… “ముఖ్యమంత్రి జగన్ ప్రతీ గ్రామానికి ఒక సచివాలయం కట్టి… మంచి పాలన అందిస్తున్నారు. 80 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టిస్తున్న వ్యక్తి సీఎం జగన్‌. నేను వైసీపీలోకి వచ్చిన నెల రోజుల్లో 100కు పైగా సచివాలయాలు ప్రారంభించాను అని అన్నారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం. వైసీపీకి కంచుకోట లాంటిది. అభ్యర్ధిని షేక్ ఆసిఫ్ ని మారుస్తారు అనే అపోహలు పెట్టుకోవద్దు. ఓసీ మేయర్ సీటులో బీసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్‌ ది. కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో వైఎస్‌ జగన్‌ నంబర్‌ వన్ లీడర్‌. కరోనా సమయంలోనూ ఇచ్చిన మాటను తప్పకుండా పని చేసిన కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు జగన్. సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వంద కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా’’ అంటూ కేశినేని(Kesineni Nani) నిలదీశారు.

కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడు. 2009లో కాంగ్రెస్ పంచలూడగొడతానన్నాడు… ఇప్పుడు వైసీపీను పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు. వైఎస్‌ జగన్‌ పెట్టిన అభ్యర్ధులపై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు. గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు. పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు’’ అంటూ నాని ఎద్దేవా చేశారు.

Also Read : Prashant Kishor: వైసీపీ ఓటమి ఖాయం ! ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!