AP Govt : ఏపీ విద్యా రంగంలో కీల‌క మార్పులు

నైపుణ్యాభివృద్ధి కోర్సుల‌కు పెద్ద‌పీట

AP Govt : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎంగా కొలువు తీరిన సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) విద్య‌, వైద్యం, ఉపాధి, మ‌హిళా సాధికార‌త‌, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ఐటీ రంగాల‌పై ఫోక‌స్ పెట్టారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో విద్యా రంగంలో కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌భుత్వం నాడు నేడు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. ప్రాథ‌మిక విద్య‌కు ప్ర‌యారిటీ ఇచ్చింది.

తాజాగా రాష్ట్రంలో కాలేజీ విద్య‌కు కొత్త రూపు తీసుకు రానుంది. నైపుణ్యంతో కూడిన విద్య‌ను అభ్య‌సించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అంద‌రికీ అందుబాటులో మార్కెట్ ఓరియంటెడ్ కోర్సుల‌ను (AP Govt)ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్ట‌మ్ ద్వారా పాఠాలు, ఇంగ్లీష్ లెర్నింగ్ ల్యాబ్స్ ను తీసుకు రానుంది. 144 కాలేజీల్లో వ‌ర్చువ‌ల్ లో క్లాస్ రూముల ద్వారా పాఠాలు బోధిస్తారు.

56 కాలేజీల్లో డిజిట‌ల్ క్లాసులు బోధిస్తారు. అంతే కాకుండా విద్యార్థుల‌లో సామాజిక‌, నైతిక బాధ్య‌త పెంచేలా హెచ్ వీపీ కోర్సులు ఏర్పాటు చేయ‌నుంది ప్ర‌భుత్వం.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న మార్కెట్ కు అనుగుణంగా ఉండేలా కోర్సుల‌ను రూపొందించే ప‌నిలో ప‌డింది ఏపీ ప్ర‌భుత్వం. ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు విద్యార్థుల‌కు మేలు చేకూర్చేందుకు క్లౌడ్ కంప్యూటింగ్, సైబ‌ర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , త‌దిత‌ర వాటిని నేర్పించ‌నున్నారు.

జ‌వ‌హ‌ర్ నాలెడ్జి సెంట‌ర్ల (Jawaharlal Nehru Knowledge Centers) ద్వారా శిక్ష‌ణ ఇస్తున్నారు. నాక్, ఎన్బీఏ గుర్తింపుతో పాటు నేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వ‌ర్క్ ల ఓనూ కాలేజీలు ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. మొత్తంగా ఉపాధికి ఊతం ఇచ్చేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

Also Read : పీవీ సింధుకు ఏపీ సీఎం కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!