Khalistanis Attack : భారత హైకమిషన్ పై దాడి
ఖలిస్తానీల నిర్వాకంపై ఫైర్
Khalistanis Attack : లండన్ లో ఖలిస్తానీలు భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. ఖలిస్తానీ మద్దతుదారులు హై కమిషన్ పై దాడికి దిగారు. బ్రిటీష్ హై కమిషనర్ ను భారత ప్రభుత్వం పిలిపించింది. ఖలిస్తానీల దాడికి(Khalistanis Attack) సంబంధించి సీరియస్ గా స్పందించింది.
ఢిల్లీలోని బ్రిటిష్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారత దేశంలోని వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ పై అణిచివేత మధ్య బ్రిటన్ లోని భారత హై కమిషన్ పై దాడికి దిగారు. ఖలిస్తాన్ మద్దతుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటన తర్వాత భారత హై కమిషన్ కు భద్రత పెంచారు.
సంఘటన జరిగిన సమయంలో భారత హై కమిషన్ వెలుపల భద్రతా వ్యవస్థ చాలా తక్కువగా ఉందని, దీని కారణంగా దాడికి దిగారంటూ ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారి సంఖ్య 80 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత ప్రభుత్వం.
బ్రిటీష్ హై కమిషనర్ ను పిలిపించింది. ఆలెక్స్ ఎల్లీస్ ఢిల్లీకి దూరంగా ఉండడంతో హైకమిషన్ డిప్యూటీ హెడ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వచ్చారు. ఇది పూర్తిగా ఆమోద యోగ్యం కాదంటూ ట్వీట్ చేశారు.
ఇవాళ జరిగిన ఘటనకు తాను చింతిస్తున్నట్లు తెలిపారు. అవమానకరమైన చర్యను తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు ఎల్లీస్. ఇదిలా ఉండగా భారత హై కమిషన్ పై జరిగిన దాడిలో(Khalistanis Attack) కిటికీలు పగలడం, భారత్ భవన్ పైకి ఎక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : అమృత పాల్ సింగ్ పై మరో కేసు