Udaipur: ఆ గ్రామల్లో హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి

ఆ గ్రామల్లో హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి

Udaipur: రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుతా సంచరిస్తుంది మనుషులు కనిపిస్తే వెంటాడి వేటాడి చంపేస్తుంది. ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు. తాజాగా ఉదయ్‌పూర్‌(Udaipur)లోని ఓ గ్రామంలో పూజారి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున పూజారి విష్ణుగిరి(65) మృతదేహాన్ని స్థానిక అడివిలో గుర్తించారు. చిరుత(Panther) అతనిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Udaipur Panther…

అయితే చిరుత దాడిలో గత 11 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. చిరుత దాడులు ఎక్కువవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని చెబుతున్న అధికారులు.. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు.

చిరుతపులి భయంతో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని పాంథర్‌లు పట్టుబడుతుండగా, చిరుతపులి దాడి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి.

సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు.

అయితే అందరిపై దాడి చేసింది ఒకే చిరుతనా అనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయిఏ అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు.

Also Read : MP Aravind : రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది – బీజేపీ ఎంపీ అరవింద్

Leave A Reply

Your Email Id will not be published!