Kinjarapu Rammohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌ గా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు !

ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌ గా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు !

Kinjarapu Rammohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్‌ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌ నాయుడి పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా భూటాన్‌ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

Kinjarapu Rammohan Naidu…

దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు… తెలుగుదేశం పార్టీ తరపున 2014, 2019, 2024 వరుసగా మూడు సార్లు శ్రీకాకుంళం పార్లమెంట్ నుండి గెలుపొందారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా టీడీపీ నుండి ఆయనకు కేంద్ర పౌర విమానయాన మంత్రిగా మోడీ కేబినెట్ లో అవకాశం దక్కింది.

Also Read : PM Modi Start : అక్టోబర్ 2న ప్రధాని చేతుల మీదుగా రైల్వే పాంబన్ బ్రిడ్జి ఓపెనింగ్

Leave A Reply

Your Email Id will not be published!