Kinjarapu Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం – కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

వరద బాధితులకు అండగా ఉంటాం - కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

Kinjarapu Rammohan: కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన మూడు నెలలకే విజయవాడకు వరదలు రావడం దురదృష్ణకరమని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan) తెలిపారు. అయినప్పటికీ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని ఆయన స్పష్టం చేసారు. కానీ బాధ్యతతో ఉండాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్… వరద రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు పనులను ఆయన స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ప్రతినిధులు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు.

Kinjarapu Rammohan Naidu Comment

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… భోగాపురం ఎయిర్‎పోర్టు పనులను ప్రతీ నెలా పరిశీలిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‎పోర్టు పనులు ఇప్పటి వరకు 40 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఏపీలో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురైనా…పట్టుదలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‎కు అత్యంత ప్రాధ్యాన ఇస్తోందని వివరించారు. 2026, జూన్ కల్లా భోగాపురం ఎయిర్‎పోర్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టేందుకు ఈ ప్రాజెక్ట్ మంచి అవకాశమని అన్నారు. భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు – సీఎం రేవంత్‌రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!