kiran Deep Kaur : అమృత పాల్ సింగ్ భార్య పట్టివేత
పారి పోయేందుకు ప్రయత్నిస్తుండగా
Kiran Deep Kaur : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు ఖలిస్తానీ ఉద్యమ సానుభూతి పరుడు , వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత పాల్ సింగ్. ఊహించని షాక్ తగిలింది. గత మార్చి 18న పోలీసులను కళ్లు గప్పి పరారయ్యాడు. ఆపై సంచలన కామెంట్స్ చేశాడు. తాను ఎక్కడికీ పారి పోలేదని , త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని ప్రకటించాడు. ఇదే సమయంలో ఒకవేళ తాను వేషం మార్చుకుంటే తన తలను తీసుకుంటానని స్పష్టం చేశాడు. పంజాబీలంతా మరో ఖలిస్తాన్ దేశం కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు.
ఇదిలా ఉండగా అమృత పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు టీమ్ జల్లెడ పడుతోంది. అంతే కాదు సమాచారం ఇచ్చిన వారికి రూ. 5 లక్షల బహుమానం ఇస్తామంటూ రివార్డు ప్రకటించింది భగవంత్ మాన్ ప్రభుత్వం. తాజాగా అమృత పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ పోలీసుల కళ్లు గప్పి లండన్ కు పారి పోయేందుకు ప్రయత్నం చేసింది. బ్రిటన్ విమానం ఎక్కేందుకు ఆమె శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు.
ఇదిలా ఉండగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే కిరణ్ దీప్ కౌర్(Kiran Deep Kaur ప్రయాణం చేస్తున్న విషయం గురించి పంజాబ్ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో ఆమెను ఎయిర్ పోర్ట్ లోనే నిలిపి వేశారు. అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్కు ఆమెకు మధ్య ఉన్న సంబంధాలు, విదేశీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు
Also Read : ఎవరీ షైస్తా పర్వీన్ ఏమిటా కథ