Kiran Kumar Reddy : సీఎం చంద్రబాబు ఏపీని అగ్రస్థానంలో నిలబెడతారు

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు...

Kiran Kumar Reddy : ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం నాడు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఇద్దరు నేతలు కలిసి పలు విషయాలపై చర్చించారు. ఎన్డీఏ నేతలతో భేటీ అయ్యారు.

కిరణ్ కుమార్ రెడ్డికి అమర్నాథ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం కిరణ్ కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి, మాకు ఎంతో అన్యోన్యమైన సంబంధం ఉంది.. అదే సంప్రదాయన్ని ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం’’ అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.

Kiran Kumar Reddy Comment

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. పోలవరం పూర్తయితే, 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వివరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇదని చెప్పారు. 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరెంట్ యూనిట్ 10 నుంచి 15 పైసలకే తయారు చేయొచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని చెప్పారు. కూటమి ప్రభుత్వం సమర్ధంగా సరిచేసి, పాలనను గాడిలో పెట్టి, సుపరిపాలన అందించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని కీలపట్ల దేవస్థానం టీటీడీ పరిధిలోకి తేవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలపట్ల వేంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ పరిధిలోకి చేర్చారని అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Minister Anam : గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మరుగున పడింది

Leave A Reply

Your Email Id will not be published!