Kiren Rijiju : దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు నియామకం
సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు
Kiren Rijiju : ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టుగా మారిన ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక ఐదుగురు న్యాయమూర్తులకు పచ్చ జెండా ఊపింది. గత కొంత కాలంగా కొలీజియం వ్యవస్థ వద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది మోదీ ప్రభుత్వం. దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) తో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వమే సుప్రీం అని సుప్రీంకోర్టు కాదని ఆయన నిండు సభలో ప్రకటించారు. మరో వివాదానికి తెర లేపారు.
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు ఉప రాష్ట్రపతి. మరో వైపు కొలీజియం వ్యవస్థ ఒక్క భారత దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదంటూ మండిపడ్డారు కిరెన్ రిజిజు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే మరో వైపు కొలీజియం వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రతినిధి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు లేఖ రాశారు సీజేఐ జస్టిస్ ధనంజయ్య వై చంద్రచూడ్ కు.
ఈ మొత్తం వ్యవహారంలో గత కొంత కాలంగా న్యాయమూర్తుల నియామకాలను నిలిపి వేస్తూ వచ్చిన కేంద్రం ఎట్టకేలకు సుప్రీంకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో దిగొచ్చింది. కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు జడ్జీలకు ఓకే చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వారైన జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ కూడా ఉన్నారు.
Also Read : ఐదుగురు న్యాయమూర్తులకు ఓకే