Kapil Sibal Kiren Rijiju : ‘కిరెన్’ కామెంట్స్ ‘కపిల్’ సీరియస్
న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ ఉందా
Kapil Sibal Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు న్యాయ వ్యవస్థపై ప్రత్యేకించి కొలీజియం వ్యవస్థపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భారత దేశంలోనే ఉందని ఎద్దేవా చేశారు. ఆయన పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ షాకింగ్ కామెంట్స్ చేయడంపై ప్రతిపక్షాలు భగ్గమన్నాయి.
ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టు , హైకోర్టులను నియంత్రించే న్యాయ వ్యవస్థను కూడా తమ ఆధీనంలోకి తీసుకు రావాలని అనుకుంటున్నాయంటూ ఆరోపించాయి.
ఏడు లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో ఆలస్యం జరుగుతోందని, దీనికి ప్రధాన కారణం న్యాయమూర్తులు ఎంపిక కాక పోవడమేనని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju).
దీనికి కారణం కొలీజియం వ్యవస్థనేని, న్యాయమూర్తుల ఎంపిక విధానంలో పారదర్శకత లేకుండా పోయిందని, విచిత్రం ఏమిటంటే చట్టాలు చేసే ప్రభుత్వం తన పాత్ర చాలా స్వల్పంగా ఉండడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా కిరెన్ రిజిజు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal).
అసలు స్వేచ్ఛ అనే పదానికి కేంద్ర మంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత బీజేపీ సర్కార్ కు దక్కుతుందన్నారు. ఈ తరుణంలో స్వతంత్రంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే చరిత్ర క్షమించదన్నారు కపిల్ సిబల్.
సరైన పాలన అంటే బెయిల్ తప్ప జైలు కాదన్న జస్టిస్ క్రిష్ణ అయ్యర్ పుస్తకాన్ని చదివితే బావుంటుందని సూచించారు. కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్ , సాకేత్ గోఖలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయ శాఖ మంత్రిపై.
Also Read : ఉగ్రవాదమా అయితే పాకిస్తాన్ ను అడగండి