Kiren Rijiju : చంద్రచూడ్ నిర్ణయం రిజిజు సంతోషం
ప్రశంసలు కురిపించిన న్యాయ శాఖ మంత్రి
Kiren Rijiju : కేంద్ర సర్కార్ కు న్యాయ వ్యవస్థకు మధ్య కొంత దూరం పెరిగింది. ఇటీవలి కాలంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ మధ్య అంతరం పెరిగింది. ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేయడం , దానిపై కౌంటర్ గా ఏదో ఒకటి మాట్లాడటం రిజిజుకు అలవాటుగా మారింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి సీజేఐ ధనంజయ చంద్రచూడ్ తో పాటు ఇతర న్యాయమూర్తులను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం రిజిజు చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఓ కేసు విషయంలో సీజేఐ ఇచ్చిన తీర్పు, తీసుకున్న నిర్ణయం బాగుందుంటూ కితాబు ఇచ్చారు రిజిజు. అర్హులైన వ్యక్తికి సకాలంలో న్యాయం చేయడం చాలా సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అంతే కాదు సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థి కి సంబంధించిన న్యాయవాది పోస్ట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను పంచుకున్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju) .
ఉత్తరాఖండ్ లో సివిల్ జడ్జీల నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు రైటర్స్ క్రాంప్ తో బాధ పడుతున్న జ్యుడీషఙయల్ సర్వీసెస్ ఔత్సాహికులకు లేఖరిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఎంతో గొప్పదంటూ ప్రశంసలు కురిపించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజుజు. సీజేఐకి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని, వైకల్యం కలిగిన అభ్యర్థికి ఎంతో ఉపశమనం కలిగించిందని తెలిపారు కిరెన్ రిజిజు.
Also Read : 14 టెర్రర్ గ్రూప్ యాప్ లపై నిషేధం