Kiren Rijiju : స్వలింగ వివాహంపై రిజిజు కామెంట్స్
ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేను
Kiren Rijiju : స్వలింగ సంపర్క వివాహంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju). ఐదుగురు విజ్ఞులైన న్యాయమూర్తులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని తాను తప్పు పట్టనని స్పష్టం చేశారు. తాను ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయబోనంటూ పేర్కొన్నారు కేంద్ర మంత్రి. స్వలింగ వివాహాల సమస్యను సుప్రీంకోర్టు విచారించడంపై రిజుజు తన వైఖరిని మరోసారి బహిరంగ పర్చారు. చట్ట బద్దత అంశాన్ని పార్లమెంట్ కు వదిలి వేయాలని కేంద్ర సర్కార్ సుప్రీంకోర్టును కోరింది.
కానీ కోర్టు ఒప్పు కోలేదు. ఐదుగురు మేధావులు తమ ప్రకారం సరైన నిర్ణయం తీసుకుంటే నేను అభ్యంతర పెట్టను. కానీ ప్రజలు కోరుకోక పోతే మీరు వాటిని ప్రజలపై రుద్ద లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కిరెన్ రిజుజు(Kiren Rijiju). వివాహ సంస్థ వంటి సున్నితమైన , ముఖ్యమైన విసయం దేవంలోని ప్రజలచే నిర్ణయించ బడాలి. సుప్రీంకోర్టు ఖచ్చితంగా కొన్ని ఆదేశాలు జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. సెక్షన్ 142 ప్రకారం వారు చట్టాన్ని కూడా చేయొచ్చు. కొన్ని సందేహాలను పూరించ గలరు. కానీ దేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేసే విషయానికి వస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఫోరమ్ కాదన్నారు.
నేను దీన్ని ప్రభుత్వం వర్సెస్ న్యాయ వ్యవస్థగా మార్చాలని కోరుకోవడం లేదన్నారు. ఇది కోర్టు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అంశం కాదన్నారు. ఇది భారత దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఇది ప్రజల అభీషానికి సంబంధించిన ప్రశ్న. ప్రజల సంకల్పం పార్లమెంట్ , శాసనసభ , అసెంబ్లీలలో ప్రజలు ఎన్నుకున్న వేదికలలో ప్రతింబిస్తుందని అన్నారు కిరెన్ రిజిజు.
Also Read : మాజీ ఎంపీ ఆనంద్ సింగ్ విడుదల