Kishan Reddy : బండి సంజయ్ మార్పుపై కామెంట్స్
అందరం ఒకే వేదికపై ఉన్నామన్న కిషన్ రెడ్డి
Kishan Reddy : కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు . గత కొంత కాలంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం మార్పుపై సంచలన ప్రకటన చేశారు. తామందరం ఒకే వేదికపై ఉన్నామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కొందరు కావాలని తమ స్వార్థ ప్రయోజనాల కోసం బురద చల్లడం మామూలేనని పేర్కొన్నారు.
బండి సంజయ్ కష్టపడి పైకి వచ్చారని, ఆయనను మార్చే ప్రసక్తి ఉండదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ కలకలం రేపింది. ఆ తర్వాత డిలీట్ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఈటల రాజేందర్ , జితేందర్ రెడ్డి, డీకే అరుణలకు కీలకమైన పదవులు దక్కుతాయని భావించారు.
ఈ తరుణంలో కిషన్ రెడ్డి స్వయంగా స్పందించడం. మీడియాతో మాట్లాడాడం ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ ను మారుస్తారంటూ వచ్చిన ఆరోపణలను ఖండించారు. అదంతా పూర్తిగా అబద్దమంటూ కొట్టి పారేశారు గంగాపురం కిషన్ రెడ్డి(Kishan Reddy). మొత్తంగా బీజేపీ శ్రేణులకు మంత్రి చేసిన ప్రకటన కొంత ఊరటను ఇచ్చిందని చెప్పక తప్పదు.
Also Read : Revanth Reddy : ఖాకీల తీరుపై రేవంత్ కన్నెర్ర