Hydra: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు !
సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు !
Hydra: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఆయన నివాసముంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు అంటించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
Hydra..
రాష్ట్ర రాజధాని తెలంగాణాలో సంచలనంగా మారిన హైడ్రా … అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలో జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా వెల్లడించింది. తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్‌లో వెల్లడించింది. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది.
Also Read : Prathipati Pulla Rao: యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరం: ప్రత్తిపాటి పుల్లారావు