Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత ! ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స !
మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత ! ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స !
Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు కొన్ని పరీక్షలు పూర్తి చేశారు. నాని గుండె సంబంధిత సమస్య బాధపడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం గ్రాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్తున్నారు. గతంలో కూడా నాని.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు.
Kodali Nani Health Issues
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో చాలా యాక్టివ్ గా ఉన్న కొడాలి నాని… అధికారం కోల్పోయిన తరువాత చాలా సైలంట్ అయిపోయారు. అనుకోకుండా మీడియాకు తారసపడినప్పుడు… తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రజలు నా ఎమ్మెల్యే ఉద్యోగం పీకి ఇంట్లో కూర్చొబెట్టిన తరువాత కూడా… నేను రోడ్డు మీద ఎలా తిరుగుతాను అంటూ మీడియాకు సెటైర్లు వేసారు. అయితే లోకేష్ రెడ్ బుక్ లో కొడాలి నాని పేరు కూడా ఉందని… త్వరలో అరెస్ట్ చేయడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని అస్వస్థతకు గురవడం… అటు పార్టీ శ్రేణుల్లో… ఇటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Also Read : AP Liquor Scam: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం