Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్

మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్

Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని… కొన్ని రోజుల నుండి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న నాని… నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు టెస్టుల్లో తేలడంతో… మెరుగైన వైద్యం కోసం అతడ్ని ముంబైలోని ఏషియన్ హర్ట్ కేర్ సెంటర్ కు తరలించారు. దీనితో అక్కడి వైద్యులు తాజాగా కొడాలి నానికి(Kodali Nani)… విజయవంతంగా బైపాస్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

Kodali Nani Health Upates

కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనితో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన సమస్య వచ్చినట్లు గుర్తించారు. ఆయన గుండెల్లో మూడు వాల్వ్స్ పూడుకు పోయినట్లు తెలుస్తోంది. గత ఐదు రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. తాజాగా, కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబై తీసుకెళ్లారు. ప్రత్యేక విమానంలో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో ముంబై తీసుకెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో సర్జరీ జరిగింది. అయితే, ఆయనకు గుండె సంబంధిత సమస్యలతో పాటు మరికొన్ని వ్యాధులు కూడా ఉన్నట్లు సమాచారం.

Also Read : Telangana Police: విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ ! హెచ్‌సీయూ వద్ద తీవ్ర ఉద్రి‍క్తత !

Leave A Reply

Your Email Id will not be published!