Kodali Nani Pawan Kalyan : కళ్యాణ్ పై కొడాలి నాని కన్నెర్ర
తీవ్రవాది అయితే కాల్చేస్తారు
Kodali Nani Pawan Kalyan : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన జనసేన చీఫ్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. తాను తీవ్రవాదినని అనుకుంటున్నాడని అలా ప్రవర్తిస్తే జనం ఉరికించి కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు కొడాలి నాని. శనివారం మాజీ మంత్రి సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ కళ్యాణ్ అనే పేరు ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ ప్రజలను చంపేస్తాడా అని ప్రశ్నించారు కొడాలి నాని(Kodali Nani Pawan Kalyan). రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం మూడు రాజధానులు తీసుకు వస్తోందని చెప్పారు.
రాష్ట్ర విభజన కోసం డిమాండ్ చేసిన పార్టీల పంచన ఎందుకు చేరాడంటూ నిలదీశారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయ అజ్ఞానం కలిగిన వాళ్లు నాయకులు కాలేరన్నారు. తమకు 55 శాతం ఓటు బ్యాంకు ఉందని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు కొడాలి నాని.
ఒక్క వెంట్రుక కూడా పీకలేరని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి బతికి ఉన్నంత కాలం ఆయనే ఏపీకి సీఎంగా ఉంటాడని మాజీ మంత్రి జోష్యం చెప్పారు. గుడివాడలో క్యాసినో ఉందన్నారు..కింది నుంచి పైస్థాయి దాకా ఫిర్యాదులు చేశారు..ఏమైందంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు 420 అయితే నారా లోకేష్ 120 అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.
Also Read : తండ్రీ కొడుకులు అవకాశవాదులు – కొడాలి