kodali Nani : ఆంధ్రప్రదేశ్ – ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన తండ్రి , దివంగత సీఎం నందమూరి ఎన్టీ రామారావు మృతికి కారణం మీరే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.
kodali Nani Comments on Purandeswari
ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలిగా పని చేయడం లేదని , కేవలం ఆమె తెలుగుదేశం పార్టీకి బాధ్యురాలిగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. అయినా ఆమెను , మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోరన్నారు కొడాలి నాని(Kodali Nani). తమను , తమ నాయకుడిని విమర్శించే నైతిక హక్కు పురంధేశ్వరికి లేదన్నారు మాజీ మంత్రి.
టీడీపీకి బీజేపీ బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడి పాలనలో జరిగిన ప్రతి అవినీతిలోనూ ఆమెకు వాటాలు అందాయని ఆరోపించారు కొడాలి నాని. బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు.
ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ ఏకమైనా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఇకనైనా పురంధేశ్వరి తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు మాజీ మంత్రి కొడాలి నాని.
Also Read : Minister KTR : మైనార్టీ పిల్లల కోసం ప్రత్యేక స్కూల్స్
