Kodali Nani : న‌న్ను ఓడించే స‌త్తా బాబుకు లేదు

మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్

Kodali Nani : వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న చంద్ర‌బాబు, లోకేష్ పై నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

గుడివాడ‌లో త‌న‌ను ఓడిస్తానంటూ చంద్రాబు నాయుడు ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నాడ‌ని కానీ అంత సీన్ లేద‌న్నారు. తండ్రీ కొడుకులు క‌లిసి వ‌చ్చినా త‌న‌ను ఓడించ లేర‌ని స‌వాల్ విసిరారు.

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వాడిన‌ని చెప్పారు కొడాలి నాని(Kodali Nani) . చంద్ర‌బాబు ఎన్ని స‌వాళ్లు విసిరినా, ఎంత‌గా గాంభీర్యం ప్ర‌ద‌ర్శించినా ప్ర‌జ‌లు ఛీ కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

సోంత కొడుకునే గెలిపించు కోలేని అస‌మ‌ర్థుడు చంద్ర‌బాబు నాయుడంటూ నిప్పులు చెరిగారు. అవాకులు , చెవాకులు పేలడం ప‌రిపాటిగా మారింద‌ని ఆయ‌న‌ను జ‌నం ఏనాడో ప‌ట్టించు కోవ‌డం మానేశార‌ని అన్నారు కొడాలి నాని.

ఎన్టీఆర్ కు టీడీపీకి సంబంధం లేదంటూ ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాయ‌లేదా అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యం వాస్త‌వం కాదా అని నిల‌దీశారు. స్వంత మామ‌నే వెన్ను పోటు పొడిచిన చంద్ర‌బాబును ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌న్నారు.

అందుకే ఆయ‌నకు కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని , ఇదే సీన్ రాబోయే ఎన్నిక‌ల్లో కూడా కంటిన్యూ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కొడాలి నాని. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వ్య‌క్తి కాద‌న్నారు.

బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని తానే పెట్టించాన‌ని చెప్పారు. ఎన్టీఆర్ విగ్ర‌హానికి ఏ రంగు అయినా వేసుకోవ‌చ్చన్నారు. సంప్ర‌దాయాలు తెలుసుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు కొడాలి నాని.

Also Read : విద్యార్థుల‌కు సీఎం జ‌గ‌న్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!