Kodanararam : మేడిగడ్డ – తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన కామెంట్స్ చేశారు. లక్షా 20 వేల కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కోదండరాం(Kodanararam). నిర్మాణంలోనే లోపం ఉందని, అందు వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురైందని ఆరోపించారు. ప్రస్తుతం నాలుగు పిల్లర్లు కుంగి పోయాయని, భారీ ఎత్తున వరదలు వచ్చినట్లయితే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు కోదండరాం.
Kodanararam Comments on Kaleshwaram
కేంద్ర సర్కార్ పరిధిలోని జల శక్తి డ్యామ్ సేఫ్టీ టీం పూర్తి నివేదిక ఇచ్చినా దాని గురించి ఇప్పటి వరకు స్పందించక పోవడం దారుణమన్నారు. పిల్లర్స్ బేస్ మెంట్ చూడకుండా ఎలా నిర్మాణం చేస్తారంటూ ప్రశ్నించారు. దీనికి ఎవరు అనుమతి ఇచ్చారో వారిపై విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ జన సమితి చీఫ్.
నాడి పట్టుకుంటే గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుందని, బ్రిడ్జి ఎందుకు కుంగిందో నిపుణులకు తెలియదా అని కోదండరాం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టుకథలు అల్లుతోందని ధ్వజమెత్తారు. ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఏం కాలేదని కానీ ఇటీవలే భారీ ఎత్తున ఖర్చు చేసినా ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందో చెప్పాలన్నారు.
Also Read : Boda Janardhan : కాంగ్రెస్ కు షాక్ బోడ గుడ్ బై