Kodandaram : ఏ పదవిని ఇచ్చినా స్వీకరిస్తా
టీజేఎస్ చీఫ్ కోదండరాం
Kodandaram : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వమైన గెలుపు సాధించింది. బేషరతుగా టీజేఎస్ మద్దతు ఇచ్చింది.
Kodandaram Comment
ఇదిలా ఉండగా సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి పలుమార్లు కోదండరాం(Kodandaram) గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రస్తుత సర్కార్ లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన సలహాలు, సూచనలు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ప్రజలకు నిజమైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ , సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కేవలం 17 మందికి మాత్రమే మంత్రులుగా పని చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇందులో తనకు మంత్రి పదవి రాక పోవచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ అడ్వయిజర్ గా ఇచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా మార్చడం శుభ పరిణామమని పేర్కొన్నారు.
Also Read : TDP Jana Sena : సీట్ల సర్దుబాటుపై టీడీపీ ఫోకస్