Nupur Sharma : నూపుర్ శర్మకు కోల్ కతా కోర్టు సమన్లు
జూన్ 20న హాజరు కావాలని ఆదేశం
Nupur Sharma : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెతో పాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నవీన్ కుమార్ జిందాల్ ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేశారు.
దాంతో పార్టీ ఈ ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ. ఈ కామెంట్లు ఇప్పుడు దేశాన్ని అల్లకల్లోలం చేస్తుండగా ప్రపంచంలోని 51 ముస్లిం దేశాలు భారత దేశాన్ని ప్రపంచ బోనులో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి.
కానీ భారత ప్రభుత్వం ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు. ఇదే సమయంలో దేశంలోని యూపీ, హైదరాబాద్ , ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ,మహారాష్ట్ర, తదితర నగరాలలో భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి.
ఇప్పటి వరకు వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో ఉక్కుపాదం మోపారు సీఎం. ఇదే సమయంలో ప్రవక్తై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నూపుర్ శర్మ(Nupur Sharma), నవీన్ జిందాల్ లను అరెస్ట్ చేయాలని డిమాండ్ ఊపందుకుంది.
ఇప్పటికే నూపుర్ శర్మకు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని. తాజాగా కోల్ కతా కోర్టు సైతం ఆమెకు సమన్లు పంపింది. ఈనెల 20న హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా నూపుర్ శర్మ(Nupur Sharma) కు మద్దతు కూడా పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు సాధ్వి ప్రగ్యా రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ దేవుళ్లను విమర్శిస్తే తాము ఊరుకోబోమన్నారు.
నూపుర్ శర్మ అన్నదాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించారు. ఆమెకు మద్దతుగా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్ , బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ నిలిచారు.
Also Read : ఈడీ ముందుకు మరోసారి రాహుల్ గాంధీ