Kolkata Doctor Rape Murder Case: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ !
కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ !
Kolkata Doctor Rape: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోల్‌కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తా(Kolkata)లోని సెల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు. దీనితో న్యాయస్థానం సంజయ్ రాయ్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో… పోలీసులు అతడిని జైలుకు తరలించనున్నారు. అలాగే, సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరుచేసింది.
Kolkata Doctor Rape Case..
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఇటీవల వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై జరిగిన ఈ దారుణం, ఆస్పత్రిపై దాడి ఘటనల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వచ్చాయి. మరోవైపు, ఈ దారుణం జరిగిన రోజు డ్యూటీలో ఉన్న ఆర్జీ కర్ ఆస్పత్రి, వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులను సీబీఐ విచారించింది. ఈ విచారణలో సందీప్ ఘోష్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయనకు లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి మంజూరు చేసింది.
Also Read : PM Narendra Modi: ‘ఉక్రెయిన్-రష్యా చర్చించుకోవాలి’ – కీవ్ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటన !