kollu ravindra: త్వరలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుంది : మంత్రి కొల్లు రవీంద్ర
త్వరలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుంది : మంత్రి కొల్లు రవీంద్ర
గతం లో వైకాపా అధినేత జగన్ నిర్వాకంతోనే నేడు ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యని ఆరోపించారు. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందించి తీరతామని, త్వరలోనే ఇసుక సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నామన్నారు.
జగన్ ఇసుకను ఆదాయ వనరుగా భావిస్తే.. తాము మాత్రం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే ఎన్జీటీ ఆదేశాల మేరకు రీచుల్ని నిలిపివేశామన్నారు. అక్టోబర్ 15 నుంచి ఇసుక రీచుల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను కూడా చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు అధికం అవుతున్నాయనే సమస్యనూ పరిష్కరిస్తామన్నారు.