Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి కీలక కామెంట్స్
ట్రాఫిక్ జాం వల్లనే ఓటు వేయలేదు
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిష్టాత్మకమైన మహిళా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా లోక్ సభలో ఇటు రాజ్య సభలో బిల్లు ఆమోదం పొందింది.
Komatireddy Venkat Reddy Comments Viral
అయితే కొందరు ఎంపీలు మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వలేదు. ఒక రకంగా వాళ్లు ఓటు వేయలేదు. అలా వేయని వారిలో ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ, జలీల్ వ్యతిరేకిస్తూ ఓటు వేయలేదని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే మొదటి నుంచి మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టారు.
వారు ఎవరో కాదు తెలంగాణకు చెందిన వారు. ఒకరు టీపీసీసీ చీఫ్ , మల్కాజ్ గిరి ఎంపీ ఎనుమల రేవంత్ రెడ్డి కాగా , మరొకరు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). వీరు ఓటు వేయక పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ ఎంపీలు.
ఆ ముగ్గురు మహిళా బిల్లుకు వ్యతిరేకులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇవాళ కోమటిరెడ్డి స్పందించారు. ట్రాఫిక్ జాంలో ఇరుక్కు పోయామని అందుకే ఓటు వేయలేక పోయామని చెప్పారు.
Also Read : Thatikonda Rajaiah : ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు