Komatireddy Venkat Reddy : ఢిల్లీలో కోమటిరెడ్డి హల్ చల్
ఏపీ భవన్ ను సందర్శించిన మంత్రి
Komatireddy Venkat Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్ సభ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు.
Komatireddy Venkat Reddy in Delhi
అనంతరం ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ ను సందర్శించారు. ఆయన వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. విభజనలో ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). ఏపీ భవన్ ను సందర్శించిన అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేనే లేవని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. త్వరగా విభజన పూర్తి చేసి నూతన భవన నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. వచ్చే మార్చి లోగా శంకుస్థాపన చేయాలన్నది తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు కోమంటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇక వచ్చే ఏడాది 2024లోగా నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read : Telangana IPS Officers : హైదరాబాద్ కు కొత్త పోలీస్ బాస్ లు