Komatireddy Venkat Reddy: తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారి కోమటిరెడ్డి బద్రర్స్ వ్యాఖ్యలు
తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారి కోమటిరెడ్డి బద్రర్స్ వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఆయన మాట్లాడుతూ… మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం… ఎంత దూరమైన పోతా’’ అంటూ వ్యాఖ్యానించారు.
Komatireddy Venkat Reddy Brothers
‘‘ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
నాలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ఇంకా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అది మీ ఇష్టం. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు. నాకన్నా చిన్నవారికి పదవులు ఇచ్చారు. మీరు ఎంపీ గెలిపించుకో అంటే గెలిపించాను. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు. మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయను’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) వ్యాఖ్యానించారు.
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందన
తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవులు విషయంలో హైకమాండ్, సీఎం నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో తాను లేనంటూ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… తాను మొదటి నుంచి ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు. మంత్రి వర్గంలో నేనొక సీనియర్ మంత్రినని… నేనెప్పుడూ తన మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారని మంత్రి అన్నారు.
Also Read : Fake Doctor: ఆపరేషన్ చేస్తుండగా నకిలీ వైద్యుడి అరెస్ట్
