Komatireddy Venkat Reddy : మోదీ కోమ‌టిరెడ్డి భేటీపై ఉత్కంఠ‌

క్యాజువ‌ల్ గా క‌లుస్తానంటున్న ఎంపీ

Komatireddy Venkat Reddy : ఈ మ‌ధ్య కాలంలో తెలుగు రాజ‌కీయాల‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్. ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడ‌ర్లు. కానీ ఉన్న‌ట్టుండి సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి(Komatireddy Venkat Reddy) త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆపై భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయ్యారు. అంతే కాదు ఇప్ప‌టి దాకా ప‌ద‌వులు ఇచ్చి స‌పోర్ట్ గా ఉంటూ వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. అనంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

ఈ త‌రుణంలో సోద‌రుడికి స‌పోర్ట్ చేయ‌లేక ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అప్ప‌ట్లో ఆయ‌న చేస‌న కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఆడియో వైర‌ల్ గా మారింది.

తాజాగా ఏఐసీసీ టీపీసీసీకి సంబంధించి రాజ‌కీయ‌, కార్య‌నిర్వాహ‌క క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ధిక్కార స్వ‌రం వినిపిస్తూ వ‌స్తున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఛాన్స్ ద‌క్క‌లేదు. త‌న‌కు ప‌ద‌వులు లెక్క కాద‌ని ,తెలంగాణ కోసం వ‌దులుకున్నాన‌ని పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో అటు నియోక‌వ‌ర్గంలో ఇటు పార్టీలో, తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) హాట్ టాపిక్ గా మారారు. పార్టీలో ఉన్నా అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీకి చెందిన నాయ‌కులు, శ్రేణులు డైలమాలో ప‌డ్డారు. సారు రూట్ ఎటు వైపు అని. తిరుమ‌ల‌ను సంద‌ర్శించిన ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాను ఎక్క‌డికీ పోన‌ని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని చెప్పారు. అంతే కాదు ఎన్నిక‌ల‌కు ఒక నెల ముందు పోటీ చేసే విష‌యం చెబుతాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో కోమ‌టిరెడ్డి శుక్ర‌వారం భేటీ కానున్నారు. దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : జ‌గ‌న్ కేసీఆర్ నాట‌కం సెంటిమెంట్ రాజ‌కీయం

Leave A Reply

Your Email Id will not be published!