Konda Vishweshwar Reddy: ఫుట్‌బాల్‌ తో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వినూత్న నిరసన

ఫుట్‌బాల్‌ తో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వినూత్న నిరసన

Konda Vishweshwar Reddy : తెలంగాణలో బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీకి కానుకగా ఫుట్‌బాల్‌ ఇచ్చి నిరసన తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్‌ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్‌ తివారీని కలిస్తే… రామచందర్‌ రావును కలవమంటున్నారు. రామచందర్‌రావును కలిస్తే… అభయ్‌ పాటిల్‌ను కలవమంటున్నారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Konda Vishweshwar Reddy : రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కి రఘునందన్‌ రావు సవాల్‌

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని బీజేపీ (BJP) ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. మా పార్టీ ఎంపీలందరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తాం… దానికి మీరు కూడా సిద్ధమా అని సవాల్‌ విసిరారు. రాజీనామా చేసే దైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఓటు చోరీపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై రఘునందన్‌రావు ఘాటుగా స్పందించారు.

‘‘పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో మేమే గెలుస్తాం కదా. మీరెందుకు 8 ఎంపీ స్థానాలు గెలుస్తారు ? అసదుద్దీన్‌ ఎలా గెలుస్తారు. దమ్ముంటే మీ 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించండి. మేమూ రాజీనామా చేస్తాం. కొత్త ఓటర్ లిస్ట్‌తో మళ్లీ ఎన్నికలకు వెళ్దాం. అప్పుడు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయి. బీజేపీను అడిగి కామారెడ్డి డిక్లరేషన్‌ హామీ ఇచ్చారా? కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. కాళేశ్వరంపై నిజాయితీగా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే యూరియా కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వచ్చింది?’’ అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Also Read :  Rabies: రేబిస్ భయంతో మూడేళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ

Leave A Reply

Your Email Id will not be published!