Koneru Konappa: మళ్లీ గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
మళ్లీ గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
Koneru Konappa : సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి భారత రాష్ట్ర సమితి గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కోనప్ప… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత పార్టీకి దూరమయ్యారు. గత కొంతకాలంగా ఆయన కేసీఆర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తుండటంతో తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే.. ఎర్రవల్లిలో ఇవాళ ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. కోనప్పతో పాటు ఆయన సోదరుడు కృష్ణ కూడా పార్టీలో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Koneru Konappa- స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి – కేటీఆర్
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సూచించారు. పార్టీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అందరితో మమేకమై ఉండే గెలుపు గుర్రాలకు పోటీకి అవకాశం కల్పించేలా చూడాలని సూచించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ప్రజలు భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పల్లె ప్రగతి పేరిట గ్రామీణ ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి హయాంలో చేసిన కార్యక్రమాలు, వాటి ఫలితాలు.. ఇప్పుడు పల్లెల్లో పరిస్థితిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు. బతుకమ్మ పండుగకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని, తెలంగాణ సంస్కృతి పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. స్థానికంగా భారత రాష్ట్ర సమితి నేతల ద్వారా బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేసేలా చూడాలని సూచించారు.
Also Read : Spoons: యువకుడి పొట్టలో 29 స్పూన్‌లు, 19 బ్రష్‌లు
