Konidela Nagababu: తొలిసారి మండలిలో అడుగుపెట్టిన నాగబాబు
తొలిసారి మండలిలో అడుగుపెట్టిన నాగబాబు
Konidela Nagababu : ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శాసన మండలి సమావేశానికి తొలిసారి హాజరయ్యే ముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోదరుడు నాగబాబును (Konidela Nagababu) పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే జనసేన శాసన సభపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక మొదటి సారి సభకు వచ్చిన నాగబాబుకు సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దల సభలో తొలిసారి అడుగుపెట్టిన నాగబాబు అక్కడ జరుగుతున్న చర్చలపై దృష్టిసారించారు. కాగా శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. యూరియా కొరతపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దేనిపైన అయిన చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్క తగ్గలేదు. వైసీపీ సభ్యుల నినాదాలకు పోటీగా టీడీపీ సభ్యులు కూడా సభలో నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు.
Konidela Nagababu – నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా
అమరావతిలో ఈ నెల 19.9.2025న జరగాల్సిన మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
Also Read : AP Assembly Sessions: పెన్షన్లు, యూరియా పంపిణీలపై వేడెక్కిన అసెంబ్లీ
