BTS Jimin With You : కొరియ‌న్ సింగ‌ర్ జిమిన్ సెన్సేష‌న్

150 మిలియ‌న్ల‌ను దాటిన స్పాటిఫై

BTS Jimin With You :  కొరియాకు చెందిన గాయ‌కుడు జిమిన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. స్పాటిఫై లో అత‌డి ఖాతా ఏకంగా 150 మిలియ‌న్ స్ట్రీమ్ ల‌ను దాట‌డం విశేషం.

జిమిన్ త‌న అకౌంట్ క్రియేట్ చేసిన‌ 142 రోజుల 10 గంట‌ల్లో ఆద‌ర‌ణ పొందాడు. కేవ‌లం ఒకే ఒక్క పాట‌తో అత్యంత వేగ‌వంత‌మైన కొరియ‌న్ సింగ‌ర్ గా చ‌రిత్ర‌లో నిలిచి పోయాడు.

ప్ర‌స్తుతం అత‌డు సాధించిన రికార్డ్ తో సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా జిమిన్ పాడిన ఆ ఒక్క పాట పేరు విత్ యు.

బిటీఎస్ ఆల్బ‌మ్ ల‌లో జిమిన్ సోలో బి – సైడ్ ట్రాక్ లు కొత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తున్నాయి. ఫిల్ట‌ర్ 320 మిలియ‌న్ స్ట్రీమ్ ల‌ను దాటింది. కొరియ‌న్ మేల్ సోలో సాంగ్ ,

ప్ర‌మోట్ చేయ‌ని కొరియ‌న్ సాంగ్ గా నిలిచింది. అత్యధికంగా ప్ర‌సారం చేసిన సోలో పాటగా వినుతికెక్కింది. వ్య‌క్తిగత బాయ్ గ్రూప్ స‌భ్యుల బ్రాండ్ కీర్తి ర్యాంకింగ్ ల‌లో బీటీఎస్ స‌భ్యుడు జిమిన్ (BTS Jimin With You) అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.

జిమిన్ వ‌రుసగా 45 నెల‌ల పాటు ర్యాంకింగ్ లో అగ్ర స్థానంలో నిలిచిన ఏకైక సింగ‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. విత్ యు అనుకోకుండా వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు జిమిన్.

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఏ మాధ్య‌మంలోనైనా జిమిన్ పాడిన పాట ట్యూన్ అవుతోంది. గుండెల్ని క‌ట్టి ప‌డేస్తోందంటున్నారు సంగీత అభిమానులు.

సంగీతానికి ఎల్ల‌లు లేవు. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేదు. అత‌డు కొరియ‌న్ అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ పాపుల‌ర్ సింగ‌ర్ గా ఎదిగి పోయాడు. అత‌డికి జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

Also Read : వాళ్లిద్ద‌రూ విడిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం

1 Comment
  1. sangram says

    Thanks For This Informative Article.

Leave A Reply

Your Email Id will not be published!