Kotha Manohar Reddy : టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి కామెంట్స్
Kotha Manohar Reddy : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
Kotha Manohar Reddy Comments on Revanth Reddy
ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలని దరఖాస్తు చేసుకున్నారు కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రూ.10 కోట్లు తీసుకొని , 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని కొందరు ఆరోపణలు చేశారని తెలిపారు.
సమయం వచ్చినప్పుడు సాక్ష్యాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద రూ. 10 కోట్లు తీసుకున్నాడని, 5 ఎకరాల భూమి రాయించు కున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ విషయం సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు సైతం చెప్పారని దీంతో తాను విస్తు పోయానని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయట పెడతానని చెప్పారు కొత్త మనోహర్ రెడ్డి.
బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యవహారం పై , ఒంటెద్దు పోకడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి పార్టీలో.
Also Read : Nara Bhuvaneswari Brahmani : చర్చిలో బ్రాహ్మణి..భువనేశ్వరి