Kris Srikanth : నేనైతే రోహిత్ ను ఎంపిక చేయ‌ను

మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్

Kris Srikanth : మాజీ భార‌త క్రికెట‌ర్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ , ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ కు స్కిప్ప‌ర్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ పై నిప్పులు చెరిగారు. తాను గ‌నుక సెలెక్ట‌ర్ ను అయితే హిట్ మ్యాన్ ను ఎంపిక చేయ‌బోనంటూ స్ప‌ష్టం చేశాడు. తాను ఎంపిక చేసే 11 మంది ఆట‌గాళ్ల‌లో రోహిత్ కు నో ఛాన్స్ అని పేర్కొన్నాడు శ్రీ‌కాంత్(Kris Srikanth) .

అత‌డు హిట్ మ్యాన్ కాద‌ని నో హిట్ మ్యాన్ అని ఎద్దేవా చేశాడు. గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో , ప్ర‌స్తుతం జ‌రుగుగ‌తున్న 16వ సీజ‌న్ లో సైతం పేల‌వమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు. విచిత్రం ఏమిటంటే రోహిత్ శ‌ర్మ స్ట్రైక్ రేటు 20 కంటే త‌క్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ప‌నికొస్తున్నా రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం మేనేజ్ మెంట్ కు భారంగా మారాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. తాను గ‌నుక ముంబై ఇండియ‌న్స్ కు హెడ్ కోచ్ లేదా మెంటార్ గా ఉంటే పూర్తిగా రోహిత్ శ‌ర్మ‌ను ప‌క్క‌న పెట్టేస్తానంటూ తెలిపాడు.

ఇప్ప‌టి దాకా 24 ఇన్నింగ్స్ లు ఆడాడు రెండు ఐపీఎల్ సీజ‌న్ లు క‌లిపి. ఒకే ఒక్క హాఫ్ సెంచ‌రీ మాత్ర‌మే సాధించ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు 10 ఇన్నింగ్స్ ల‌లో 200 కూడా పూర్తి చేయ‌లేక పోయాడు.

Also Read : గ్లెన్ ఫిలిప్స్ రియ‌ల్ టార్చ్ బేర‌ర్

Leave A Reply

Your Email Id will not be published!