Krithi Krithivasan : టీసీఎస్ సిఇఓగా కృతివాసన్
రాజేష్ గోపీనాథన్ రాజీనామా
Krithi Krithivasan : ప్రముఖ భారతీయ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థకు నూతన మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు కృతి కృతివాసన్(Krithi Krithivasan). ఇదే స్థానంలో ఉన్న రాజేష్ గోపినాథన్ రాజీనామా చేశారు.
దీంతో ఈ పోస్టు ఖాళీగా ఏర్పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారని టీసీఎస్ వెల్లడించింది. కంపెనీ బీఎఫ్ఎస్ఐ విభాగానికి చెందిన గ్లోబల్ హెడ్ కె. కృతి వాసన్ ను సిఇఓ గా పదోన్నతి కల్పించినట్లు టీసీఎస్ వెల్లడించింది.
గోపినాథన్ సెప్టెంబర్ 15 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. ఇదిలా ఉండగా టీఎసీఎస్ లో సుదీర్ఘ కాలం పాటు రాజేష్ గోపినాథన్ సేవలు అందించారు. ఆయన ఏకంగా 22 ఏళ్ల పాటు ఇందులో పని చేశారు. గత ఆరు సంవత్సరాల నుంచి ఎండీగా , సిఇఓగా విశిష్ట సేవలు అందించారు. తన ఇతర ప్రయోజనాలను కొనసాగించేందుకు కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారని టీసీఎస్ వెల్లడించింది. ఈ సందర్బంగా రాజేష్ గోపినాథన్ మాట్లాడారు.
తాను టీసీఎస్ లో పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల పాటు సేవలు అందించాను. నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినందుకు గౌరవ చైర్మన్ టాటా గారికి ధన్యావాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో నాతో పాటు ఎంతో కాలం సమర్థవంతంగా పని చేసిన చరిత్ర కృతినాథన్(Krithi Krithivasan) కు ఉందన్నారు గోపినాథన్. నాయకత్వ పరంగా మరింత ముందుకు సంస్థను తీసుకు వెళతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Also Read : ఐఐటీ హైదరాబాద్ లో జాబ్స్