KS Eshwarappa : కర్ణాటక అట్టుడుకుతోంది. నిన్న రాత్రి భజరంగ్ దళ్ కు చెందిన సభ్యుడు హత్యకు గురయ్యాడు. దీంతో రాష్ట్రంలో విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఈ ఘటనపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa) స్పందించారు.
ఓ వర్గానికి చెందిన వారే కావాలని హత్యకు పాల్పడ్డారంటూ ఆరోపించారు.
మరో వైపు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ హిజాబ్ ఉధృతంగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ హత్యకు ప్రేరేపించాయంటూ మండిపడ్డారు.
26 ఏళ్ల హర్ష అనే వ్యక్తిని ఆదివారం సాయంత్ర గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. అతను చాలా మంచి వాడు.
నిజాయితీ పరుడైన యువకుడు. ముస్లిం గూండాలు అతడిని హత్య చేశాయంటూ సంచలన ఆరోపణలు చేశారు కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa).
గుండాయిజాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించ బోమని, బాధితుడి కుటుంబాన్ని తాము ఆదుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
తరగతిలో హిజాబ్ పై నిరసనలు, ప్రతిఘటనలు జరిగినప్పుడు శివమొగాలోని ఓ కాలేజీలో జాతీయ జెండాను తీసి
దాని స్థానంలో కాషాయ జెండాను ఎగుర వేశారంటూ డీకే శివకుమార్ ఇటీవల ఆరోపించారు.
జాతీయ జెండాను తీసి వేసినట్లు ఎలాంటి వీడియో సాక్ష్యాలు లేక పోవడంతో ఆయన ఆవేశాలను రెచ్చ గొట్టారంటూ అధికారంలో ఉన్న బీజేపీ ఆరోపించింది.
ఇదిలా ఉండగా మంత్రి ఈశ్వరప్ప చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్.
ఆయన నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో అన్ని విద్యా సంస్థలను మూసి వేశారు. హర్ష మృతి తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హత్య చేసిన వారిని ఇంకా గుర్తించ లేదని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర.
Also Read : అఖిలేష్ ను తండ్రే నమ్మడం లేదు