KTR: ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ! బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి !
ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ! బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి !
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈమేరకు తెలంగాణ సీఎంవో అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు.
KTR – కేటీఆర్‌కు కవిత శుభాకాంక్షలు
కేటీఆర్‌కు (KTR) భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నయ్య.. కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్
పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి వెళ్లి కేసీఆర్‌ను కేటీఆర్ కలిశారు.
Also Read : Rahul Gandhi: రేవంత్ సర్కార్‌పై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు
