RS Praveenkumar KTR : కేటీఆర్ కామెంట్స్ ఆర్ఎస్పీ సెటైర్
వాస్తవాన్ని భలే బాగా చెప్పారంటూ ఫైర్
RS Praveenkumar KTR : అసెంబ్లీ సాక్షిగా ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముమ్మాటికీ ఇది కుటుంబ పాలనే అంటూ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. సభ సాక్షిగా నిలదీశాయి. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా తమది ఫ్యామిలీ పాలన అంటూ చెప్పారు. తమది కుటుంబ పాలనేనని, రాష్ట్రంలోని 4 కోట్ల మంది తమ కుటుంబ సభ్యులేనని, కల్వకుంట్ల చంద్ర శేఖర్ తమ కుటుంబానికి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వారని చెప్పారు కేటీఆర్. ఈ సందర్బంగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ స్పందించారు.
ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం తెలంగాణ అంతా మీ కుటుంబమేనా కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ పేరుతో దోచుకున్న సొమ్ము కూడా రాష్ట్ర ప్రజలదేనా అని ప్రశ్నించారు ఆర్ఎస్పీ(RS Praveenkumar KTR). సౌత్ గ్రూప్ లాంటి బినామీలు, రూ. 100 కోట్లు, కాంట్రాక్టర్లు, హెలికాప్టర్లు , మెడికల్ కాలేజీలు, కంపెనీలలో పెట్టుబడులు, ఫారిన్ టూర్లు , బీఆర్ఎస్ పేరుతో సభలు, సమావేశాలు కల్వకుంట్ల కుటుంబానికి చెందినవేనని మరి ప్రజలకు ఇందులో భాగస్వామ్యం అనేది ఉందా అని నిలదీశారు బీఎస్పీ చీఫ్.
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికే కోట్లు ఉన్నాయని మిగతా వారికి ఎందుకు లేవనే విషయం ప్రజలు ఆలోచించాలన్నారు రాష్ట్రాన్ని దోచుకున్నది కాక ఇప్పుడు దేశానికి కన్నం పెట్టేందుకు బీఆర్ఎస్ బ్యాచ్ బయలు దేరిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : మోదీ పాలనలో దేశం వెనకకు – కేటీఆర్