KTR: బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా
బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా
KTR : ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి తనపై చేసిన ఆరోపణలపై బండి సంజయ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిద్ధమయ్యారు. తనపై చేసిన ఆరోపణలకు గాను బండి సంజయ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.
KTR Files Defamation
కాగా, ఫోన్‌ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కు… బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో… కేటీఆర్ తాజాగా పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు.
KTR – అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్- ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే తమ పార్టీ నుంచి గెలిస్తే బీఆర్‌ఎస్ చేపట్టే కార్యక్రమిలకు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. దీన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లో భాగంగా ఆ ఎమ్మెల్యేల సమాధానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చారు.
దీనిలో భాగంగా సోమవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు… స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆదారాలు సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పాల్గొన్న మరిన్ని ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో జగదీష్‌రెడ్డి, వివేక్ గౌడ్ చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘వాళ్లు బీఆర్‌ఎస్‌లో ఉంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వాళ్లు బీఆర్‌ఎస్‌లో ఉంటే రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉంటే కేసీఆర్‌తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు.
Also Read : Medha School: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
