KTR Inaugurate : భాగ్య‌న‌గ‌రానికి మ‌రో మ‌ణిహారం

శిల్పా లేవుట్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభం

KTR Inaugurate : భాగ్య‌న‌గ‌రం సిగ‌లో మ‌రో మ‌ణిహారం చోటు చేసుకుంది. భారీ ఎత్తున నిర్మించిన శిల్పా లేవుట్ ఫ్లై ఓవ‌ర్ ను శుక్ర‌వారం ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్(KTR Inaugurate) ప్రారంభించారు. మొద‌టి ద‌శ పూర్తి కావ‌డంతో దీనికి శ్రీ‌కారం చుట్టారు మంత్రి. ఇదిలా ఉండ‌గా ఐటీ కారిడార్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేశారు.

ఈ భారీ ఫైఓవ‌ర్ వంతెనను నిర్మించేందుకు దాదాపు రూ. 250 కోట్లు ఖ‌ర్చు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇది ప్ర‌తిష్టాత్మ‌కమైన ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించారు. ఇది నేరుగా ఓఆర్ఆర్ పైకి చేర‌నుంది. ఇన్ ఆర్బిట్ మాల్ , ర‌హేజా మైండ్ , స్పేస్ చౌర‌స్తా , బ‌యో డైవ‌ర్సిటీ కి వెళ్లేందుకు ఈ వంతెన ద్వారా వీలు క‌లుగుతుంది.

దీనిని హైద‌రాబాద్ నాలెడ్జ్ సెంట‌ర్ ను దృష్టిలో పెట్టుకుని దీనిని నిర్మించారు. ఈ శిల్పా లేవుట్ ఫ్లై ఓవ‌ర్ పొడ‌వు 986 మీల‌ర్లు, వెడ‌ల్పు 16 మీట‌ర్లు. మొత్తం న‌గ‌రంలో ఉన్న వంతెన‌ల‌లో కెల్లా ఇదే అతి పెద్ద‌ది . ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తయిన వాటిలో ఇది 17వ ప్రాజెక్టు కావ‌డం విశేషం.

ఈ వంతెన ప్రారంభం కావ‌డంతో హైటెక్ సిటీకి, రంగారెడ్డికి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేందుకు మ‌రింత క‌నెక్టివిటీ పెర‌గ‌నుంది. ఈ ఏరియాలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ఐటీ కంపెనీలు కొలువు తీరాయి. ఒక‌ప్పుడు ఐటీ అనేస‌రిక‌ల్లా బెంగ‌ళూరు గురించి ప్ర‌ధానంగా చెప్పేవాళ్లు. కానీ సీన్ మారింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ జ‌పం చేస్తున్నారు.

ఇక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకించి ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, త‌దిత‌ర రంగాల‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తోంది. ఒక ర‌కంగా అభివృద్ది ప‌నుల్లో ఈ వంతెన నిర్మాణం కూడా ఒక‌టిగా చేరి పోతుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : బీజేపీలో చేరిన మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!