KTR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్
KTR : తెలంగాణలో కష్టం అనే మాట వినబడితే… బాధితులకు అండగా నిలబడేది గులాబీ జెండా ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణా భవన్ అంటే ఒక జనతా గ్యారేజీలా మారిందన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా… వారు తెలంగాణా భవన్ వైపు చూడటమే దీనికి ఉదాహరణ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోయే ఎల్కతుర్తితో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభా ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్‌ఎస్ నేతలంతా నివాళులర్పించారు.
KTR Inspects
అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ… ‘‘14 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి అన్ని వర్గాలను సమీకరించి రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్‌ఎస్. గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందనే పద్ధతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రజల్ని రెచ్చగొట్టడానికో, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి కాదు. 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున జరుపుకొనే వేడుక మాత్రమే. 1250 ఎకరాల్లో సభా స్థలం ఉండగా… వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించాం. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నాం. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య తాగునీటి వసతి కల్పిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుపై నమ్మకం లేనందున జెనరేటర్లు ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతుంది’’ అన్నారు.
Also Read : Telangana Tourists: శ్రీనగర్ హోటల్ లో బిక్కుబిక్కుమంటున్న 80 మంది తెలంగాణ పర్యాటకులు