KTR Governor : గవర్నర్ తో పేచీ లేదు పవర్ మళ్లీ మాదే
సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్
KTR Governor : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్(Governor), పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళి సై సౌందర రాజన్ తో తమకు ఎలాంటి పేచీ లేదని స్పష్టం చేశారు.
అయితే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు అంత సీన్ లేదన్నారు. ఒక రకంగా ఆరా సర్వే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాల్లో తమకే మళ్లీ అధికారం వస్తుందన్నది వాస్తవమేనని, ఇందులో ఎలాంటి అనుమానమే అక్కర్లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఐటీ అనే సరికల్లా గతంలో బెంగళూరు అని చెప్పే వారని కానీ ఇప్పుడు ఆ సీన్ మారిందన్నారు.
ఇప్పుడు ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ జపం చేస్తున్నాయని స్పష్టం చేశారు కేటీఆర్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi)పై నిప్పులు చెరిగారు.
బీజేపీ పెద్దల అవినీతి, అక్రమాల కారణంగానే ఇవాళ దేశంలో రూపాయి విలువ పడి పోయిందన్నారు. ఎన్ని సర్వేలు చేసినా రాష్ట్రంలో రాబోయేది తిరిగి టీఆర్ఎస్ వస్తుందని జోష్యం చెప్పారు కేటీఆర్(KTR).
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఇప్పటి వరకు 9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చారంటూ ఆరోపించారు. అధికారిక కార్యక్రమమైతే తాము స్వాగతం పలుకుతామని, కానీ ప్రైవేట్ కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదన్నారు.
గతంలో ప్రధాన మంత్రులు రూ. 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోదీ ఒక్కడే రూ. 100 లక్షల కోట్ల అప్పులు చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
Also Read : జల విలయం వరద బీభత్సం