KTR: బీఆర్ఎస్ ను ఇతర పార్టీల్లో విలీనం చేసే ప్రసక్తే లేదు – కేటీఆర్‌

బీఆర్ఎస్ ను ఇతర పార్టీల్లో విలీనం చేసే ప్రసక్తే లేదు - కేటీఆర్‌

KTR : తెలంగాణ ప్రజల కోసం పుట్టి, పోరాడిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడే కాదు… ఎప్పటికీ ఏ ఇతర పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) స్పష్టం చేసారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసన్నారు. ఇరకాటంలో పడిన ప్రతిసారీ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఈ పనికిరాని చెత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి, రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆక్షేపించారు.

KTR Key Comments on BRS Party Merge

ఎంపీ సి.ఎం. రమేశ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే… హెచ్‌సీయూ రూ.10 వేల కోట్ల కుంభకోణంపైనా, రూ.1660 కోట్ల రోడ్‌ కాంట్రాక్ట్‌ స్కామ్‌ పైనా కలిసి చర్చిద్దామని సవాల్‌ విసిరారు. సి.ఎం. రమేశ్‌ చేసిన ఆరోపణలపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సి.ఎం. రమేశ్‌ ల బాగోతాన్ని తాను బయట పెట్టడంతో ఏం చేయాలో తోచక ఇద్దరూ సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు.

పోలీసులు రేవంత్‌రెడ్డికి కట్టు బానిసలుగా పనిచేస్తున్నారు – కేటీఆర్ 

ఫోన్ ట్యాపింగ్‌ పై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తున్నాయని… తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అధికారులు ట్యాపింగ్ చేస్తే చేయొచ్చని రేవంత్‌రెడ్డి అన్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే అధికారుల తప్పా అని కేటీఆర్ నిలదీశారు. ఎవరూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో కనుక్కోవడమే పోలీసుల పనిగా మారిందని విమర్శించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఘోరంగా ఉందని ఆరోపించారు. పోలీసుల మెడకాయపైన తలకాయ ఉన్న పనే చేస్తున్నారా అని నిలదీశారు. పోలీసులు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి కట్టు బానిసలుగా పనిచేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం శాశ్వతం కాదని.. రేవంత్ బానిసలుగా పని చేస్తున్న ఒక్కో పోలీసు పేరు రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు వడ్డీతో సహా కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు.

Also Read : CM Revanth Reddy: జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!