KTR KCR : నా తండ్రి కేసీఆర్ నాకు స్పూర్తి
హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా విషెస్
KTR KCR : కేసీఆర్ ఈ మూడక్షరాలు తల్చుకుంటనే గుండె ఉప్పొంగుతుంది. నాకే కాదు కోట్లాది మందికి ఆయన స్పూర్తి దాయకంగా ఉన్నారు. కేసీఆర్ సీఎంగా కంటే నాకు తండ్రిగా ఉన్నందుకు గర్వ పడుతున్నానని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. జూన్ 18న ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇవాళ కేటీఆర్ తండ్రికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని, కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు కేటీఆర్.
ప్రతి పిల్లలకు తల్లిదండ్రులే ప్రేరణగా నిలుస్తారు. మా అమ్మ, తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో మేం నడుస్తూ ఉన్నాం. వాళ్లు ఈ బతుకు ప్రయాణంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఉద్యమ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ మొక్కవోని పట్టుదల, అంకితభావం, మాట ఇస్తే తప్పని స్వభావం, పరిపాలనా పరమైన అనుభవం నేను నా తండ్రి కేసీఆర్(KCR) నుంచి నేర్చుకున్నానని స్పష్టం చేశారు కేటీఆర్.
ఇవాళ తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఎందుకంటే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకు వచ్చిన అరుదైన నాయకుడు, ఉద్యమ స్పూర్తి ప్రదాత నా తండ్రి కేసీఆర్ అయినందుకు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచి ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ఓ గుర్తింపును, గౌరవాన్ని కలిగించేలా అవకాశం కల్పించినందుకు నా తండ్రికి నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
Also Read : YS Sharmila : నువ్వు లేవు నీ జ్ఞాపకం మిగిలే ఉంది