KTR : సీఎం రేవంత్‌ పై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్‌ పై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

KTR : కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనికి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతా అని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాసంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌… రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR Slams CM Revanth Reddy

‘సీఎం రేవంత్‌ రెడ్డికి (CM Revanth Reddy) సరిగా కేసులు కూడా పెట్టడం రాదు. మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌, కారు రేసింగ్‌ అని తప్పులు పెడుతున్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసేదేమీ లేదు. రేవంత్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్‌ ఏం అభివృద్ధి చేశారు ? 18 నెలల పాలనలో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా,ఎక్కడికైనా చర్చకు సిద్ధం. కేసీఆర్‌ సీతారామ ప్రాజెక్ట్‌ కడితే రేవంత్‌ రిబ్బన్‌ కట్‌చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్ట్‌లు వచ్చాయి.

2014లో ఖమ్మం ఎలా ఉండేది. మా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా ?. ఖమ్మంను అభివృద్ధి చేసింది కేసీఆర్‌ కాదా? సీఎం రేవంత్‌ సీటుకు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి ఎసరుపెడుతున్నారు.అందుకే వారి ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్‌ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు.

నేను లోకేష్‌ను కలిస్తే తప్పేంటీ ? – కేటీఆర్

ఏపీ మంత్రి లోకేష్‌ను నేను కలవలేదు… కలిసినా తప్పేంటి? అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు . లోకేష్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని… లోకేష్‌ ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేవంత్‌ ప్రెస్‌మీట్‌ కు యువత దూరంగా ఉండాలను సూచించారు. రేవంత్ పిరికి సన్నాసని… చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఫైరయ్యారు. రేవంత్‌ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని… చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్‌ లా తాను దొంగను కాదని.. సంచులు మోయలేదని సెటైరికల్ పంచ్ వేశారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి. నేను జీవితంలో ఏనాడూ సిగరెట్‌ కూడా తాగలేదు. సీఎం రేవంత్‌రెడ్డి నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. నేను ఏం చేసినా.. బాజాప్త చేస్తా.

బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి… ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నదని సీఎంపై నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Also Read : Justice Yashwant Varma: సుప్రీంకోర్టుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

Leave A Reply

Your Email Id will not be published!