KTR : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేక పోయినా ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీతో పాటు కీలక నాయకులపై మండిపడ్డారు. ఇవాళ సిరిసిల్లలో పర్యటించి ప్రసంగించారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని బొంద పెడుతం అంటూ హెచ్చరించారు.
తెలంగాణ వాళ్లకు భాష రాదన్నారు. పాలన చేత కాదని ఎద్దేవా చేశారు. కానీ దేశంలోనే తెలంగాణ ఇప్పుడు ఐకాన్ గా మారిందన్నారు. రాష్ట్రం వస్తే నీళ్లు, కరెంట్ ఉండదన్నారు.
ఇప్పుడు 24 గంటల పాటు అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కావాలనే వివక్ష చూపిస్తున్నారంటూ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ లు నోటికి వచ్చినట్టు సీఎం కేసీఆర్ ను మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి బాబు బంట్రోతన్నారు. బండి ఎవరి బంటో తెలియదని ఎద్దేవా చేశారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా మళ్లీ మోదీ మాట్లాడటంపై మండిపడ్డారు. తెలంగాణ సమాజం క్షమించదన్నారు. బీజేపీని బట్టలు ఇప్పించి కొడతామన్నారు.
అన్ని సంస్థలను అమ్మేస్తున్నారని మోదీపై ఫైర్ అయ్యారు. ఆసియాలోనే అతి పెద్ద మేడారం జాతరకు రెండున్నర కోట్లు ఇస్తారా అని కిషన్ రెడ్డిని నిలదీశారు.
Also Read : తాతయ్య ఆశీర్వాదం మనుమడు ఆనందం