KTR Modi : మోదీ లిజ్ ట్రస్ ను చూసి నేర్చుకో – కేటీఆర్
సరైన ఆర్థిక విధానం చేయనందుకు పీఎం గుడ్ బై
KTR Modi : మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు (KTR Modi) . కనీసం బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికై సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేనందుకు బాధతో తన పదవిని వదులుకున్న లిజ్ ట్రస్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఒక రకంగా ఈ నిర్ణయం తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
ట్విట్టర్ వేదికగా ఆమె గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కేటీఆర్(KTR) . కేవలం ఆరు వారాల పాటు మాత్రమే లిజ్ ట్రస్(Liz Truss) దేశానికి ప్రధానమంత్రిగా పని చేశారని కానీ ఎనిమిది సంవత్సరాలైనా ఈరోజు వరకు తాను ఇచ్చిన హామీలను ఏనాడో మరిచి పోయిన ప్రధానమంత్రి ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు.
రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారని కానీ లిజ్ ట్రస్ లాంటి వాళ్లు గుర్తుండి పోతారని పేర్కొన్నారు. ఓ వైపు ద్రవ్యోల్బణం మరో వైపు నిరుద్యోగం పెరుగుతుంటే మోదీ మౌనంగా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దేశంలో లెక్కకు మించి 2 కోట్లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
ఇకనైనా లిజ్ ట్రస్ ను చూసైనా నేర్చుకోవాలంటూ హితవు పలికారు రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దేశంలో ఉన్న వనరులను గుర్తించకుండా, వినియోగించకుండా ఉన్న ఏకైక ప్రధాని ఒక్క మోదీ మాత్రమేనని ధ్వజమెత్తారు.
Also Read : డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు – సబిత